Thursday, January 23, 2025

కర్ణాటక డిప్యూటి సిఎం డికేతో షర్మిల భేటి

- Advertisement -
- Advertisement -

కర్ణాటక :  కర్ణాటక రాష్ట్ర ఉపముఖ్యమంత్రి డికే శివకుమార్ ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ఎంతో కష్టపడ్డారని వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. సోమవారం బెంగుళూరు చేరుకున్న షర్మిల ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి డికె శివకుమార్ ఇంటికి వెళ్లి డికే సమావేశమయ్యాయి. ఈ సందర్బంగా డికేకు పుష్కగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు.

ఎంతగానో శ్రమించి కాంగ్రెస్‌పార్టీని గెలిపించుకోవటంలో డికే శివకుమార్ తన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కించుకున్నారని , మర్యాద పూర్వకంగానే డికేను కలిసి అభినందలు తెలిపేందుకు వచ్చానే తప్ప ఇందులో ప్రత్యేకత ఏమి లేదని ఈ సందర్బంగా షర్మిల పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి శివకుమార్ మాట్లాడుతూ తనకు మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డితో ఉంతో సాన్నిహిత్యం ఉండేదని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News