Friday, December 27, 2024

రుణా మాఫీకాక రైతుల ఆత్మహత్యలు: షర్మిల

- Advertisement -
- Advertisement -

వరంగల్ : రైతులు బ్యాంకుల్లో తీసుకున్న రుణాలు మాఫీకాక రైతులు అనేక నష్టాలు భరించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వైఎస్‌ఆర్ టిపి రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఆదివారం వరంగల్, హనుమకొండ జిల్లాల్లో ఆమె పాదయాత్రలు కొనసాగాయి. వరంగల్ తూర్పు నియోజకవర్గం నుండి మొదలైన పాదయాత్ర పశ్చిమ నియోజకవర్గంలోని పబ్లిక్‌గార్డెన్‌లో ప్రజలనుద్దేశించి మాట్లాడారు.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇచ్చిన హామీలను ఇప్పటి వరకు నెరవేర్చలేదన్నారు.

స్థానిక ఎంఎల్‌ఎలు అవినీతిలో కూరుకుపోయి ఉన్నారన్నారు. ప్రజలకు సేవ చేయలేని ఎంఎల్‌ఎలను ఎందుకు సహించాలని ఆమె ప్రశ్నించారు. వైఎస్ షర్మిల పాదయాత్ర సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు నాడెం శాంతికుమార్ ఆధ్వర్యంలో పాదయాత్ర ఏర్పాట్లను ఘనంగా ఏర్పాటు చేశారు. సోమవారం పశ్చిమ నియోజకవర్గం నుండి స్టేషన్‌ఘన్‌పూర్‌లో పాదయాత్ర కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News