హైదరాబాద్: వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల శనివారం భారతీయ జనతాపార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ , కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డిలకు ఫోన్ చేసి మాట్లాడారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యపై కలిసి పోరాడుదామని కోరారు. ఇందుకోసం ఉమ్మడిగా కార్యాచరరణ సిద్దం చేసుకుందామని తెలిపారు. ప్రగతి భవన్‌కు మార్చ్ పిలుపునిద్దామని సూచించారు. ప్రభుత్వం మెడలు వంచాలంటే ప్రతిపక్షాలు ఏకం కావాల్సిన అవసరం ఉందని , కలిసి పోరాటం చేయకపోతే ప్రతిపక్షపార్టీలను తెలంగాణలో బతకనివ్వరని అన్నారు.
షర్మిల పోన్‌కాల్‌కు బిజేపి నేత బండి సంజయ్ సానుకూలత వ్యక్తం చేశారు. ఉమ్మడి పోరాటం చేసేందకు మద్దతు తెలిపారు. త్వరలోనే సమావేశం అవుదామని తెలిపారు. నిరుద్యోగుల విషయంలో ఉమ్మడి పోరాటానికి బిజేపి పూర్తి మద్దతు ఇస్తుందని ప్రకటించారు. ఇదే అంశంపై పిసిసి నేత రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. ప్రతిపక్షాలు కలిసి పోరాటం చేయాల్సిన సమయం ఏర్పడిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో చర్చించి తమ నిర్ణయం వెల్లడిస్తామని షర్మిలకు తెలిపారు.