Wednesday, January 22, 2025

ప్రతిపక్షాలు గుడ్డి గుర్రాలకు పళ్లు తోమున్నాయి: షర్మిల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్రంలో దొంగలు దోచుకుంటుంటే అడ్డుకోవాల్సిన ప్రతిపక్ష పార్టీలు గుడ్డి గుర్రాలకు పళ్లు తోముతున్నాయని వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఆన్నారు. గురువారం షర్మిల మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో 33 ప్రాజెక్టులు నిర్మించి బీడు భూములకు నీళ్లు పారించినందుకు వైఎస్‌ఆర్ తెలంగాణను రోకటిబండతో కొట్టిచంపినట్టా అని ప్రశ్నించారు. రైతుల రుణాలు మాఫీ, ఉచిత విద్యుత్ సరఫరా , సబ్సిడీ పథకాలు అములు చేసి వ్యవసాయాన్ని వైఎస్‌ఆర్ పండగ చేసినందుకు కోట్టిచంపినట్టా అని ప్రశ్నించారు.

ఆరోగ్యశ్రీ , పక్కా ఇళ్లు ,ఫీజ్ రీఎంబర్స్‌మెంట్ , లక్షకొలది ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసినందుకు ప్రజలను కొట్టిచంపినట్టు భావించాలా అన్ని ప్రశ్నించారు.మిగులు బడ్జెట్‌తో ఏర్పడిన రాష్ట్రం ఎందుకు అప్పులపాలయిందో చెప్పాలన్నారు. తల్లిలాంటి తెలంగాణను చంపుతున్న అసలు కసాయి గుండాలు ఎవరో ప్రజలకు తెలుసని షర్మిల పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News