Wednesday, December 25, 2024

ధాన్యం తరుగులు తగదు: షర్మిల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఆరుగాలం శ్రమకోర్చి పండించిన పంటలు అకాల వర్షాలతో దెబ్బతిని రైతులు పుట్టెడు దు:ఖంలో ఉన్నారని వైఎస్‌ఆర్‌తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. మంగళవారం షర్మిల మీడియాతో మాట్లాడుతూ తడిసిన ధాన్యం కొనాలని, తూకాలలో కోతలు పెట్టవద్దని రైతులు కాళ్లావేళ్లా పడుతున్నా ప్రభుత్వం గుండె కరగటం లేద్నారు. మిల్లర్లు , వ్యాపారులు క్వింటాలుకు 12కిలోలు తరుగు తీసి రైతుల పొట్టకొట్టడం తగదని సూచించారు.

అరకొర ధాన్యం దిగుబడులపైన కూడా కోతలు పెడితే రెతు ఎలా బతకాలన్నారు. ఎండనకా, వాననకా రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారని తెలిపారు. రైతు పండించిన ధాన్యాన్ని ఎటువంటి కోతలు లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. బుధవారం రాష్ట్రంలోని అన్ని ఐకెపి కేంద్రాల వద్ద ధర్నాలు నిర్వహించనున్నట్టు షర్మిల వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News