Wednesday, January 22, 2025

ఎకరాకు రూ.30వేలు సాయం అందించాలి: షర్మిల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.30వేలు సాయం అందించాలని వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ప్రభుత్వానికి విజ్ణప్తి చేశారు. గురువారం షర్మిల మీడియాతో మాట్లాడుతూ గతంలో మిరప రైతులకు ఇస్తామని ప్రకటించిన నష్టపరిహారంలాగా కాకుండా ,వరి రైతులను ఆదుకోవాలన్నారు.

నెలరోజులైనా ఇంకా సాయం రైతులకు అందనే లేదన్నారు. అకాల వర్షాల వల్ల రాష్ట్రంలో 10లక్షల ఎకరాల్లో పంట నష్టాలు జరిగాయన్నారు. తడిసిన ధాన్యాన్నికూడా పూర్తిగా కొనుగోలు చేయలన్నారు.కన్నీరు పెడుతున్న రైతులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలవాని షర్మిల పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News