Monday, December 23, 2024

నేను వైఎస్ఆర్ బిడ్డను.. బోనులో పెట్టినా పులి పులే

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రేపు ఇందిరా పార్క్ వద్ద నిరాహార దీక్ష చేస్తున్నామని వైఎస్ షర్మిల తెలిపారు. తెలంగాణ నిరుద్యోగుల తరుఫున పోరాటం చేసింది మేమేనని తెలిపారు. మా పోరాటం వల్లే.. ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చాయని ఆమె వెల్లడించారు. నేను వైఎస్ ఆర్ బిడ్డను.. బోనులో పెట్టినా పులి పులే అన్నారు.

చంచల్ గూడ జైలు నుంచి వైఎస్ షర్మిల మంగళవారం సాయంత్రం విడుదల అయ్యారు. నిన్న పోలీసులపై దాడి కేసులో షర్మిల అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. నాంపల్లి కోర్టు నిన్న షర్మిలకు 14 రోజుల రిమాండ్ విధించింది. ఇవాళ ఆమెకు బెయిలు మంజూరు చేసింది. జైలు నుంచి బయటకు వచ్చిన షర్మిల మీడియాలో సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం సంచలన వ్యాఖ్యలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News