Monday, December 23, 2024

కెసిఆర్ ఎన్నో హామీలు గాలికివదిలేశారు: షర్మిల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: చంచల్‌గూడ జైలు నుంచి వైఎస్‌ షర్మిల మంగళవారం సాయంత్రం విడుదలయ్యారు. అనంతరం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కెసిఆర్ కు పరిపాలన చేతనవుతోందా? కెసిఆర్ ఎప్పుడైనా సచివాలయానికి వెళ్లారా? కెసిఆర్ ఏ హామీలు అమలు చేశారు? అని షర్మిల ప్రశ్నించారు. కెసిఆర్ ఎన్నో హామీలు గాలికివదిలేశారని తెలిపారు.

కెసిఆర్ కు అవినీతి చేయడం తప్ప ఏమీ చేతకాలేదని ఆమె ఆరోపించారు. కెసిఆర్, ఆయన కుమారై, కుమారుడు అవినీతి చేస్తున్నారు. సిట్ విజ్ఞప్తి పత్రం ఇవ్వాలనుకోవడం నేరమా? మగ పోలీసులు నన్ను తాకే ప్రయత్నం చేశారు. నాపై పడి దాడి చేసి ఉక్కిరిబిక్కిరి చేస్తే ఏం చేయాలి? మహిళా పోలీసులు నా చేయి విరగొట్టే ప్రయత్నం చేశారని షర్మిల పేర్కొన్నారు.

కెసిఆర్ పాలనను ఆప్ఘన్ పాలన అని కాకా ఏమనాలి..? అని షర్మిల ప్రశ్నించారు. తన ఆత్మరక్షణ కోసం మగ పోలీసులను నెట్టివేయడం జరిగిందని ఆమె వివరణ ఇచ్చారు. నన్ను బెదిరించే వీడియోలు ఎందుకు బయటపెట్టలేదన్నారు. పోలీసులు కొన్ని వీడియోలను మాత్రమే ఎంచుకుని వైరల్ చేశారని ఆమె పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News