Wednesday, January 22, 2025

జగనన్న వల్లే వైఎస్ కుటుంబం చీలిపోయింది: షర్మిల సంచలన వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కాంగ్రెస్ అధ్యక్షరాలు షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం చీలింది అంటే దానికి కారణం జగనన్ననే అంటూ షర్మిల బాంబు పేల్చింది. దీంతో షర్మిల వ్యాఖ్యలు ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్ గా మారాయి.

గురువారం కాకినాడలో కాంగ్రెస్‌ పార్టీ నేతలతో షర్మిల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ తన కుటుంబాన్ని చీల్చి రాజకీయం చేస్తుందని జగన్‌ చేసిన ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రాన్ని, తన కుటుంబాన్ని కాంగ్రెస్‌ పార్టీ చీల్చిందని జగన్‌ అరోపించారని… వైఎస్‌ కుటుంబం చీలిందంటే.. అది కేవలం జగనన్న వల్లే జరిగిందని మండిపడ్డారు. జగన్‌ వల్లే తమ కుటుంబం విడిపోయిందనడానికి దేవుడు, మా తల్లి విజయమ్మనే సాక్ష్యం అని ఆమె చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News