Friday, December 20, 2024

కాంగ్రెస్‌లోకి షర్మిల..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీలో వై.ఎస్. షర్మిల చేరనున్నారు. వై.ఎస్. షర్మిల తన పార్టీ వైఎస్‌ఆర్‌టిపిని ఈ నెల 4వ తేదీన కాంగ్రెస్‌లో విలీనం చేయనున్నారు. ఈ మేరకు వైఎస్సార్‌టిపి ముఖ్యనేతలతో వై.ఎస్ షర్మిల మంగళవారం సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్‌టిపి నేతలకు కీలక పదవులు దక్కే అవకాశం ఉందని పార్టీ నేతలకు వెల్లడించారు. ఈ విషయాలపై కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ వై.ఎస్.షర్మిలకు సమాచారం పంపారు.

ఈ నెల 4వ తేదీన కాంగ్రెస్ పార్టీలో చేరాలని వై.ఎస్. షర్మిలకు మల్లికార్జున ఖర్గే నుండి ఆహ్వానం అందింది. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత కర్ణాటక నుండి రాజ్యసభ పదవిని వై.ఎస్. షర్మిలకు ఇచ్చే ప్రతిపాదనను ఆ పార్టీ నాయకత్వం చేసిందని ప్రచా రం సాగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్సార్‌సిపి అభ్యర్థులను మార్చాలని వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. 40 నుండి 60 స్థానాల్లో వైఎస్సార్‌సిపి అభ్యర్థులను మార్చనున్నారు. వైఎస్సార్‌సిపి అసంతృప్తులు వై.ఎస్. షర్మిల వెంట నడిచే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News