Friday, January 24, 2025

జగన్ అన్న.. ప్రత్యేక హోదా మర్చిపోయారు: షర్మిల

- Advertisement -
- Advertisement -

ఇటీవల ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల.. రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని వైసీపీ, టీడీపీ పార్టీలపై విరుచుకుపడ్డారు. బుధవారం విశాఖపట్నం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. ఏపీలో కుమ్మక్కు రాజకీయాలు నడుస్తున్నాయన్నారు. ఉత్తరాంధ్రను రెండు పార్టీలు మోసం చేశాయని ఆరోపించారు.

చంద్రబాబువి కనిపించే పొత్తులు.. జగన్ అన్నవి మాత్రం కనిపించని పొత్తులని విమర్శించారు. 25 మంది ఎంపీలు ఇస్తే ప్రత్యేక హోదా తెస్తానని జగన్ అన్న అన్నారని.. అధికారంలో వచ్చిన వెంటనే మరిచిపోయారని చురకలంటించారు. వీరిద్దరు.. విశాఖకు ఏం చేశారు? అని ప్రశ్నించారు. రైల్వే జోన్ కూడా ఇవ్వలేదు?.. గంగవరం పోర్టులో రాష్ట్ర వాటాను అప్పన్నంగా అదానికి ఇచ్చేశారని మండిపడ్డారు. విశాఖ ఉక్కు కర్మాగారానికి తూట్లు పొడుస్తున్నారని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి స్టీల్ ఫ్యాక్టరీని నిర్వీర్యం చేశాయన్నారు. బీజేపీ తొత్తులుగా ఉన్న వైసీపీ, టీడీపీ లను ఓడగొట్టాలని.. కాంగ్రెస్ ను గెలిపించాలని షర్మిల అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News