- Advertisement -
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం చేసిన అప్పులకు కిస్తీలు కట్టేందుకు కూడా మిగలటం లేదని వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఊపర్ షేర్వానీ అందర్ పరేషానీ అన్నట్టుగా ఉందన్నారు. రాష్ట్రం ఏర్పడే నాటికి రూ.16వేలకోట్ల సంపద ఉండగా, ఇప్పుడు రాష్ట్రం రూ.4.50లక్షల కోట్ల అప్పుల్లో ఉందన్నారు. ప్రభుత్వం చేసిన అప్పులకు గత ఏనిమిదిన్నరేళ్లుగా కట్టిన వడ్డీలే లక్ష కోట్లు ఉన్నట్టు తెలిపారు ఆరోగ్యశ్రీకి, ఫీజ్ రీఎంబర్స్‌మెంట్‌కు ప్రభుత్వం వద్ద డబ్బుల్లేవన్నారు.ఉద్యోగుల జీతాలకు కూడా అతిగతి లేదన్నారు.ఒక్కొక్కరినెత్తిన రూ.లక్షన్నర అప్పుల భారం మిగిలిందని షర్మిల ఈ మేరకు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
- Advertisement -