Saturday, December 21, 2024

కాంగ్రెస్‌కు షర్మిల మద్దతు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కాంగ్రెస్ కు వైఎస్ ఆర్ తెలంగాణ పార్టీ మద్దతు ప్రకటించింది. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటెయ్యాలని ఆమె తన పార్టీ నేతలకూ, కార్యకర్తలకూ పిలుపునిచ్చింది. తెలంగాణలో పోటీనుంచి విరమించుకుంటున్నట్లు ఆ పార్టీ అధినేత్రి షర్మిల స్పష్టం చేశారు. తనకు కాంగ్రెస్ పార్టీ అంటే ఎంతో గౌరవముందన్నారు.

తెలంగాణలో 3800 కిలోమీటర్ల మేర తాను పాదయాత్ర చేశాక, ఎన్నో పోరాటాలు చేశాక ఈ నిర్ణయం తీసుకోవడం ఎంతో బాధాకరమన్న సంగతి తనకు తెలుసునన్నారు. ఈ నిర్ణయం తీసుకోవడం ఒక విధంగా తెలంగాణ ప్రజలకోసం తాను చేస్తున్న త్యాగమని ఆమె అన్నారు. తన నిర్ణయాన్ని పార్టీ నేతలూ, కార్యకర్తలు అర్థంచేసుకోవాలని కోరారు. ఒకవేళ ఎవరినైనా నొప్పిస్తే, క్షమించమన్నారు. రాహుల్ గాంధీ పాదయాత్రతో తెలంగాణలో సత్ఫలితాలు వస్తాయని ఆమె ఆకాంక్షించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News