Sunday, December 22, 2024

రేపు గజ్వేల్‌లో షర్మిల పర్యటన

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి శనివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. లోటస్‌పాండ్‌లోని పార్టీ కార్యాలయం నుంచి బయలు దేరి ఉదయం 10 గంటలకు జగదేవ్ పూర్ మండలం, తీగుల్ గ్రామానికి చేరుకుంటారు. ఇటీవల దళితబందు పథకం అర్హులకు అందడం లేదని ఆందోళన వ్యక్తం చేసిన తీగుల్ గ్రామ ప్రజలను కలిసి వివరాలు అడిగి తెలుసుకుంటారు. అదే గ్రామంలో ప్రజలను ద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వాటి అమలు తీరుతెన్నులు , ప్రజల సమస్యలను తెలుసుకుంటారు.ఈ కార్యక్రమం అనంతరం షర్మిల నేరుగా హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. షర్మిల పర్యటనలో ఆమెతోపాటు పలువురు నాయకులు పాల్గొనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News