Wednesday, January 22, 2025

పంటల దెబ్బతిన్న ప్రాంతాల్లో షర్మిల పర్యటన

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఇటీవల కురిసిన అకాల వర్షాలవల్ల పంటలు దెబ్బదితన్న ప్రాంతాల్లో వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల పర్యటించనున్నారని ఆ పార్టీ నేత పిట్టం రామిరెడ్డి తెలిపారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రామిరెడ్డి మాట్లాడుతూ పార్టీఅధినేత ఆదివారం ఉమ్మడి వరంగల్ జిల్లా మధిర, వైరా , ఇల్లందు నియోజకవర్గాల్లో పర్యటిస్తారని తెలిపారు. మే 1న పాలేరు నియోజకవర్గంలో పర్యటిస్తారన్నారు.

పంటలు నష్టపోయిన రైతులను పరామర్శించి వారికి ధైర్యం చెబుతారన్నారు. అకాల వర్షాలకు రాష్ట్రంలోని 10లక్షల ఎకరాల్లో పంటనష్టం జరిగిందన్నారు. మార్చి 23న ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రకటించిన పంటనష్టం పరిహారం వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని కోరారు. ఆప్‌కి బార్ కిసాన్ సర్కారు అని చేసిన ప్రకటనను నిలబెట్టుకోవాలన్నారు. రైతుల సమస్యలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ రాష్ట్ర రైతుల పక్షాన నిలిచి పోరాడుతుందని పార్టీ నేత పిట్టం రామిరెడ్డి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News