Friday, January 24, 2025

జగన్ ప్రభుత్వం శిలాఫలకాల ప్రభుత్వం: షర్మిల

- Advertisement -
- Advertisement -

అమరావతి: వైసిపి ఎంఎల్‌ఎలకు అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదని ఎపిసిసి ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు. కర్నూలు జిల్లాలో ఆలూరులో కాంగ్రెస అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా షర్మిల మీడియాతో మాట్లాడారు. వేదవతి ప్రాజెక్టు పూర్తి చేస్తానన్న సిఎం జగన్ హామీ ఏమైందని ప్రశ్నించారు. వైఎస్ శిలాఫలకం వేసిన ప్రాజెక్టుకు జగన్ మళ్లీ శిలాఫలకం వేశారని, జగన్ ప్రభుత్వం శిలాఫలకాల ప్రభుత్వం అని షర్మిల విరుచుకపడ్డారు. వైసిపికే ఓటు వేస్తే డ్రైనేజీలో వేసినట్లేనని, కాంగ్రెస్‌తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News