Monday, December 23, 2024

ఇది తాలిబన్ల రాజ్యమా?: షర్మిల

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో అతిపెద్ద సమస్య నిరుద్యోగం అని వైఎస్ షర్మిల తెలిపారు. ఎపిపిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిరసన దీక్ష చేపట్టారు. మెగా డిఎస్‌సి కావాలని డిమాండ్ చేస్తూ వైఎస్ షర్మిల నిరసనకు దిగారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. 2.3 లక్షల ఉద్యోగాలిస్తామని జగన్ అధికారంలోకి వచ్చారని, ఎక్కడ ఇచ్చారని సిఎం జగన్ ను ప్రశ్నించారు. మెగా డిఎస్‌సి కాకుండా దగా డిఎస్‌సి ఇచ్చారని, గ్రామ సచివాలయ ఉద్యోగాలు వారి కార్యకర్తలకు ఇచ్చారని, ఎపిపిఎస్‌సి ద్వారా భర్తీ చేస్తామన్న ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయని ప్రశ్నించారు. తాము నిరసనలు తెలిపాలనుకుంటే ఎక్కడికక్కడ నియంత్రించారని, ఎపిలో ఏమైనా ప్రత్యేక రాజ్యాంగం ఉందా? అని, కర్ఫ్యూ వాతావరణం సృష్టిస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పోలీసులను వైఎస్‌ఆర్‌సిపి నేతలకు బంటుల్లా వాడుకుంటున్నారని, ప్రతిపక్షాలపై దాడులు చేస్తున్నారని, జర్నలిస్టులను చితకబాదుతున్నారని, ఇదేమైనా తాలిబన్ల రాజ్యమా లేక ప్రజాస్వామ్యమా అని ధ్వజమెత్తారు. నిజంగా చిత్తశుధ్ధి ఉంటే ఆందోళన చేస్తే జగన్ ప్రభుత్వానికి ఎందుకు భయం అని, తాము ప్రజలకు దగ్గరవుతామని వైఎస్‌ఆర్‌సిపి వాళ్లకు భయం పట్టుకుందని షర్మిల విమర్శలు గుప్పించారు. వైఎస్‌ఆర్‌సిపి అధికారంలోకి వస్తే జాబ్ నోటిఫికేషన్ల వరద పారిస్తామన్నారని, ఐదేళ్లలో ఒక్క జాబ్ క్యాలెండర్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. జాబ్ నోటిఫికేషన్లు లేకపోవడంతో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారని దుయ్యబట్టారు. ఉపాధి లేక 21 వేల మంది ఆత్మహత్య చేసుకున్నట్టు సర్వేలు చెబుతున్నాయని, యువత లేని రాష్ట్రంగా ఎపి తయారయ్యే అవకాశం ఉందని ఆమె వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News