Friday, November 22, 2024

జాబ్ క్యాలెండర్ ఏదీ జగన్: వైఎస్ షర్మిల

- Advertisement -
- Advertisement -

అమరావతి: కర్నూలులో న్యాయ రాజధాని అంటే ఇదేనా? అని ఎపి కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. స్మార్ట్ సిటీ చేస్తామన్నాని, కనీసం మంచినీళ్లు లేవని ఎద్దేవా చేశారు. కర్నూలులో ఎపిసిసి ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల పర్యటిస్తున్నారు. ఐదేళ్లలో ఒక్క ప్రాజెక్టు అయినా పూర్తి చేశారా?, గుండ్రేవుల ప్రాజెక్టు పూర్తయి ఉంటే కర్నూలు వాసులకు నీళ్లు వచ్చేవని, ఉద్యోగ నోటిఫికేషన్లు లేక యువత రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని, ఏటా జనవరికి జాబ్ క్యాలెండర్ అన్నారని, ఏదీ ఎక్కడ కనపడటంలూదపి షర్మిల చురకలంటించారు. ఆర్‌టిసి, విద్యుత్‌తో పాటు అన్నింటీ ఛార్జీలు పెంచారని, ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో లాగేసుకుంటున్నారని, చేసిన మోసం చాలదని ఇప్పుడు సిద్ధమని బయల్దేరారన్నారు. ప్రత్యేక హోదా అని మోసం చేశారని, ఉద్యోగాలు ఇస్తామని కూడా మోసం చేశారని జగన్ పై షర్మిల విరుచుకపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News