Sunday, January 19, 2025

తేదీ మీరు చెబుతారా, నన్ను చెప్పమంటారా?..

- Advertisement -
- Advertisement -

వైవీ సుబ్బారెడ్డితో షర్మిల సై అంటే సై..

పిసిసి అధ్యక్ష పదవిని చేపట్టి, 24 గంటలైనా కాకముందే వైసీపీకి ముచ్చెమటలు పోయిస్తున్నారు వైఎస్ షర్మిల. ఆమె సోమవారం పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత క్యాడర్ ను ఉద్దేశించి మాట్లాడుతూ అటు చంద్రబాబునూ, ఇటు సోదరుడు జగన్ రెడ్డినీ చెరిగిపారేశారు. అంతటితో ఆగలేదామె. మంగళ వారంనుంచి ప్రారంభించిన జిల్లాల పర్యటనలోనూ రెండు పార్టీల నేతలను ఉతికి ఆరేస్తున్నారు.

షర్మిల మంగళవారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా పలాస నుంచి ఇచ్చాపురం వరకూ బస్సులో ప్రయాణించారు. తోటి ప్రయాణికులతో మాట్లాడుతూ వారి కష్టసుఖాలను కనుక్కున్నారు. బస్సులోనే విలేఖరులతోనూ మాట్లాడారు. ఈ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి గురించి షర్మిలకేం తెలుసంటూ వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యను ప్రస్తావించగా, ‘సుబ్బారెడ్డి గారూ… మీరు చేసిన అభివృద్ధిని చూసేందుకు నేను సిద్ధం. మీరు చూపిస్తారా? దానిని చూసేందుకు తేదీ మీరు చెబుతారా.. నన్ను చెప్పమంటారా?’ అంటూ ప్రశ్నించారు. పైగా జగన్ రెడ్డి అని పిలిస్తే సుబ్బారెడ్డికి నచ్చడం లేదనీ, అందుకే ఇకపై అన్నగారూ అని పిలుస్తాననీ చెప్పారు.

ఇచ్చాపురంలో షర్మిల మాట్లాడుతూ ‘బిజేపికి జగన్ ప్రభుత్వం కీలుబొమ్మలా మారింది. ఒక్క రోజు కూడా జగన్ ప్రత్యేక హోదా గురించి అడిగింది లేదు. రాష్ట్రంలో పార్టీలు బిజేపికి తొత్తులుగా మారాయి. రాష్ట్రంలో పరిస్థితులు చూస్తే బాధగా ఉంది’ అని షర్మిల అన్నారు. ‘వైఎస్సార్ కి కాంగ్రెస్ ఎంత బలమో… కాంగ్రెస్ కి వైఎస్సార్ అంతే బలం. రాజశేఖర్ రెడ్డిని కాంగ్రెస్ అవమానించిందని కొందరు ప్రచారం చేస్తున్నారు. ఆ ప్రచారంలో వాస్తవం లేదు. వైఎస్సార్ అంటే ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీకి ఎంతో అభిమానం ఉంది’ అని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News