Thursday, January 23, 2025

సిఎం కెసిఆర్‌కు షర్మిల బహిరంగ లేఖ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:ఏళ్ల తరబడి వెనుకబాటుకు గురైన ఖమ్మం ప్రాంతాన్ని అభివృద్ది చేసి ఆ ప్రాంత ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ముఖ్యమంత్రి కేసిఆర్‌కు విజ్ణప్తి చేశారు. ఖమ్మ జిల్లా పర్యటనను పురస్కరించుకుని మంగళవారం నాడు సిఎం కేసిఆర్‌కు బహిరంగలేఖ రాశారు. ఏపిలో విలీనమైన ఏడు మండలాలను తిరిగి తెలంగాణలో కలపాలన్నారు. సీతారామప్రాజెక్టుకు కేటాయించిన రూ.13వేలకోట్లు ఖర్చు చేసి ఈ ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేయాలన్నారు.

భద్రాచలం ఆలయాన్ని వెయ్యికోట్లతో అభివృద్ది చేసి 2016లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు. భారీ వరదలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరారు. భద్రాచలం ప్రాంత ముంపు సమస్యలకు పరిష్కారంగా ప్రకటించిన రూ.వెయ్యికోట్లు కేటాయించాలన్నారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని కోరారు. సింగరేణి ప్రైవేటీకరణపై స్పష్టత ఇవ్వాలన్నారు. గ్రానైట్ పరిశ్రమకు విద్యుత్ సబ్సీడీలపై ప్రభుత్వ వైఖరిని ప్రకటించాలని కోరారు.

ఖమ్మం గడ్డపై ప్రజల ఆకాంక్షలు కార్యరూపం దాల్చేందుకు తగిన విధంగా స్పందించాలని ముఖ్యమంత్రి కేసిఆర్‌కు బహిరంగలేఖ ద్వారా విజ్ణప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News