Tuesday, December 24, 2024

రాజారెడ్డి నిశ్చితార్థ వేడుకలో జగన్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఎపిసిసి ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి నిశ్చితార్థ వేడుక శుక్రవారం రాత్రి ఘనంగా జరిగింది. గండిపేటలోని గోల్కొండ రిసార్ట్ లో అంగరంగా వైభవంగా నిశ్చితార్థ వేడుక జరిగింది. ఈ వేడుకకు ఎపి సిఎం జగన్ మోహన్ రెడ్డి, తెలంగాణ మంత్రులు భటి విక్రమార్క్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, ఎపి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, సినీ నటులు మోహన్‌బాబు, విష్ణు, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి, ఎపి కాంగ్రెస్ నేతలు శైలజానాథ్, జెడి శీలం, ప్రముఖ రాజకీయ నాయకులు, మత పెద్దలు హాజరయ్యారు. సిఎం జగన్ తన సతీమణి భారతితో కలిసి నేరుగా వేదిక పైకి వెళ్లారు. తల్లిని ఆప్యాయంగా పలకరించిన తరువాత ఆలింగనం చేసుకున్నారు. షర్మిల-అనిల్ పలకరించారు. వధూవరులకు శుభాకాంక్షలు చెప్పారు. పుష్పం గుచ్ఛం ఇచ్చి ఫొటో తీస్తుండగా షర్మిల దూరంగా ఉండడంతో దగ్గరకు రావాలని సైగ చేశారు. అందరూ కలిసి ఫొటో దిగారు.

 

YS sharmilas son engagement

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News