Sunday, January 19, 2025

నాకు ప్రాణహాని ఉంది: వైఎస్ సునీత

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరో : తనను చంపేస్తానని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని వైఎస్ సునీత గచ్చిబౌలిలోని సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశారు. తన తండ్రి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని చంపిన వారిని కఠినంగా శిక్షించాలని హైకోర్టు, సుప్రీంకోర్టు ఆమె చుట్టూ తిరుగుతున్నారు. వైఎస్ వివేకా హత్య జరిగిన నాటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో బెదిరింపులు వచ్చినప్పటికీ ఆమె వెనక్కి తగ్గలేదు. ఇటీవల తన సోదరి వైఎస్ షర్మిలను సునీత కలవడం, ఆమెతో పాటు ఇడుపులపాయకు వెళ్లడంపై ఎపి రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ క్రమంలోనే “చంపేస్తామంటూ” సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారంటూ ఆమె ఫిర్యాదు చేశారు.

ఫేస్‌బుక్‌లో బెదిరింపులు…
గత కొద్ది రోజుల నుంచి వర్రా రవీంద్రారెడ్డి అనే వ్యక్తి తన ఫేస్‌బుక్ పేజీలో తన పైన, తన సోదరి షర్మిలపైన అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నాడని పేర్కొన్నారు. ఈ పోస్టులు తమ ప్రతిష్టను దిగజార్చే విధంగా ఉన్నాయని వాపోయారు. రవీంద్రార్ రెడ్డి ఫేస్‌బుక్ పేజీలో మొత్తం తనను, షర్మిలను, వైఎస్ విజయమ్మను కించపరుస్తూ పోస్టులు ఉన్నాయని తెలిపారు. తమపై పోస్టులు పెట్టే వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.కాగా, డాక్టర్ వైఎస్ సునీత తనకు ప్రాణహాని ఉందంటూ సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేశారని సైబర్ క్రైమ్ డిసిసి శిల్పవల్లి తెలిపారు. ఈ తరహా బెదిరింపులు ఎక్కువ అవుతున్నాయని చర్యలు తీసుకోవాల్సిందిగా ఆమె కోరినట్లు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News