Friday, December 20, 2024

సోదరుడిగా కాకపోయిన.. సిఎంగానైనా సమాధానం చెప్పాలి:సునీత

- Advertisement -
- Advertisement -

అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునిత నర్రెడ్డి మాట్లాడారు. వైఎస్ వివేకాను చంపిందెవరో దేవుడు, కడప జిల్లా ప్రజలకు తెలుసని,ఎవరినైనా ఒకసారి మోసం చేయవచ్చని.. కానీ పదేపదే మోసం చేయలేరని సునిత నర్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తాను, వైఎస్ షర్మిల ఎవరి ప్రభావంతోనో మాట్లాడుతున్నట్లు సిఎం వైఎస్ జగన్ ఆరోపణలు చేస్తున్నారని, హైదరాబాద్, కడపలో తాను అడిగిన ప్రశ్నలకి అన్నగా కాకపోయిన సిఎంగా నైనా సమాధానం చెప్పాలని, ప్రజలు అంతా గ్రహిస్తున్నారని వాస్తవాలేంటో వారికి తెలుసన్నారు. అవినాష్ రెడ్డిని ఎందుకు కాపాడుతున్నారో సమాధానం చెపాలన్నారు. సాక్షి చానలల్ కి వస్తా..డిబేట్ చేద్దాం నిజనిజాలు బయటకు వస్తాయని సునితా వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News