- Advertisement -
నల్లగొండ: ఎపి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తల్లి విజయమ్మకు రోడ్డు ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి ఒంగోలు వెళ్తుండగా తెలంగాణ రాష్ట్రం నల్లగొండలోని వాడపల్లి వద్ద విజయమ్మ వాహన శ్రేణిలో ముందున్న వాహనం నెమ్మదించడంతో డ్రైవర్ ఒక్కసారిగా బ్రేకులు వేశాడు. దీంతో వాహణ శ్రేణిలో కార్లు ఒకదానితో ఒకటి స్వల్పంగా ఢీకొన్నాయి. విజయమ్మ ప్రయాణిస్తున్న కారు స్వల్పంగా దెబ్బతింది. అనంతరం ఆమె మరో వాహనంలో ఒంగోలుకు ప్రయాణమయ్యారు. విజయమ్మ సోదరి అత్త, టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తల్లి అనారోగ్య సమస్యలతో ఒంగోలులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె పరామర్శించడానికి ఆమె ఒంగోలు వెళ్లి అక్కడే రాత్రి సుబ్బారెడ్డి ఇంట్లో బస చేశారు.
- Advertisement -