సభకు కోవిడ్ నిబంధనలతో అనుమతి
హైదరాబాద్: ఈ నెల 9న షర్మిల ఖమ్మంలోని పెవిలియన్ గ్రౌండ్స్‌లో వైఎస్ షర్మిల సంకల్ప సభ కోవిడ్ నిబంధనలమేరకు నిర్వహించాలని పోలీసులు అనుమతినిచ్చారు. అయితే షర్మిలకు ఆశీస్సులు ఇవ్వడానికే విజయమ్మ హాజరుకానున్నట్లు ఆ పార్టీ ప్రతినిధులు వివరించారు.షర్మిలతోపాటు వైఎస్ విజయలక్ష్మి, పిన్ని భారతి సభా వేదికపై ప్రసంగించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి బయలురనున్న షర్మిలకు దారి పోడవునా ఆమెను ఘన స్వాగతం పలికేందుకు ఆమె సన్నిహితులు ఏర్పాట్లు చేస్తున్నారు. దారి పొడువునా 6 చోట్ల షర్మిల కు ఘన స్వాగతం పలికేలా ఏర్పాట్లు చేశారు.
తెలంగాణ హక్కులు సాధించేందుకు షర్మిల ముందుకు వస్తోందని షర్మిల పార్టీ అనుచరులు పిట్టా రాంరెడ్డి, ఇందిర శోభన్ తెలిపారు. కొత్తపార్టీ పేరు, పార్టీ గుర్తు, జెండా, పార్టీ నియమావళి, సిద్ధాంతాలను ఈ సభలోనే ప్రకటించబోతున్నారని తెలుస్తోంది. తెలంగాణలో జరిగే తొలిసభకు ఖమ్మం వేదిక అవుతున్న నేపథ్యంలో ఖమ్మం లో సభ నిర్వహణకు గాను అనుమతికోసం ఆ పార్టీ నేతలు ఖమ్మం నగర పోలీసు కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్‌కు దరఖాస్తు చేశారు. అయితే కొవిడ్ నేపథ్యంలో నిబంధనలు పాటిస్తూ సభ జరుపుకొనేలా పోలీసు శాఖ అనుమతిచ్చింది