Thursday, January 23, 2025

వివేకా హత్య కుట్ర అవినాష్ రెడ్డికి ముందే తెలుసు: సిబిఐ

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఎంపి అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులోమళ్లీ వాదనలు ప్రారంభమైయ్యాయి. భోజన విరామం తర్వాత హైకోర్టులో మళ్లీ వాదనలు జరగనున్నాయి. అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని సిబిఐ వాదించింది. అవినాష్ నుంచి మరింత సమాచారం సేకరించాల్సిఉందని సిబిఐ కోరింది. గతంలో నాలుగు విచారణల్లో అవినాష్ సహకరించలేదుని సిబిఐ స్పష్టం చేసింది. వివేకా హత్య కుట్ర వైఎస్ అవినాష్ రెడ్డి ముందే తెలుసు అని సిబిఐ ఆరోపిందిచింది. దర్యాప్తులో శాస్త్రీయ, సాంకేతిక ఆధారాలు సేకరించామని సిబిఐ వెల్లడించింది.

హత్యను గుండెపోటుగా ఎందుకు చిత్రీకరించారో తెలియాలని సిబిఐ కోర్టుకు తెలిపింది. హత్య రోజు ఉదయం అవినాష్ జమ్మలమడుగు దగ్గరల్లో ఉన్నట్లు చెప్పారు. మొబైల్ సిగ్నల్స్ చూస్తే అవినాష్ ఇంట్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. హత్య రోజు అవినాష్ రాత్రంతా ఫోన్ అసాధారంగా వాడారని సిబిఐ ఆరోపించింది. హత్యకు ముందు, తర్వాత అవినాష్ ఇంట్లో సునీల్, ఉదయ్ ఉన్నారు. అవినాష్ కు సునీల్, ఉదయ్, జయప్రకాశ్ రెడ్డితో సంబంధాలు తేలాలని సిబిఐ పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News