Wednesday, January 22, 2025

వైఎస్ వివేకా వర్ధంతి… తప్పు చేసిన వారికి తప్పక శిక్ష పడాలి: సునీత

- Advertisement -
- Advertisement -

అమరావతి: తన తండ్రి హత్య కేసులో నిజం తెలియాలనే ఉద్ధేశంతోనే తాను పోరాటం చేస్తున్నాని దివంగత మాజీ ఎంపి వైఎస్ వివేకా నంద రెడ్డి కుమార్తె సునీత తెలిపారు.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా పులివెందులలో వైఎస్ వివేకానందా రెడ్డి 4వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. సునీత కుటుంబం వివేకా సమాధి వద్ద నివాళులర్పించింది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. తప్పు చేసిన వారికి తప్పక శిక్ష పడాలని వివేకా కుమార్తె సునీత తెలిపారు. దర్యాప్తు సంస్థలను ఎవరూ ప్రభావితం చేయకూడదన్నారు. వివేకా హత్య కేసు విషయంలో ఎంతో మంది తెలియకుండానే సహకరిస్తున్నారని, వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. జస్టిస్ ఫర్ వైఎస్ వివేకా అనే యాష్ ట్యాగ్ ట్విట్టర్‌లో వైరల్ అవుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News