Wednesday, January 22, 2025

అమరావతి రైతులపై వైసిపి దాడి హేయమైన చర్య: అచ్చెన్నాయుడు

- Advertisement -
- Advertisement -

AP TDP Atchannaidu As New President

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతి రైతులపై వైసిపి దాడి హేయమైన చర్య అని ఎపి టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. రైతులపై దాడి చేసిన సందర్భంగా అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు. ఇది ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి అని, సిఎం జగన్ రెడ్డి అరాచక పాలనకు ఈ దాడి అద్దం పడుతుందని దుయ్యబట్టారు. నేరస్తుడి పాలనలో రాష్ట్రం నాశనమవుతోందని, ఎంపి భరత్, పిల్లి సుభాష్ చంద్రబోస్ ప్రజాప్రతినిధి అనే విషయాన్ని మరిచి వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టపగలు రైతులపై పెట్రోల్ సీసాలు, బీరు సీసాలు, కర్రలతో దాడి చేస్తున్నా పోలీసులకు పట్టదా? అని ప్రశ్నించారు. న్యాయస్థానం అనుమతితో జరుగుతున్న పాదయాత్రకు రక్షణ లేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో ఉందన్నారు. ఎంపి మార్గాని భరత్ తో పాటు దాడిలో పాల్గొన్న వైసిపి నేతలందరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News