Sunday, December 22, 2024

వైఎస్ఆర్ పాదయాత్రతోనే కాంగ్రెస్ అధికారంలో వచ్చింది: రేవంత్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్రతోనే గతంలో కాంగ్రెస్ అధికారంలో వచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. వైఎస్‌ఆర్ 75వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి సిఎం రేవంత్, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ నివాళులర్పించారు. అనంతరం వైఎస్ఆర్ ఫొటో ఎగ్జిభిషన్‌ను సందర్శించారు. గాంధీ భవన్ లో రేవంత్ మీడియాతో మాట్లాడారు. వైఎస్‌ఆర్ స్ఫూర్తితోనే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ప్రధానిని చేసేందుకు ముందుకు వెళ్లాలని స్పష్టం చేశారు. రాహుల్‌కు వ్యతిరేకంగా వెళ్లే వారు వైఎస్ వారసులు కాదన్నారు. రాహుల్ ప్రధానిని చేస్తేనే పేదలకు సంక్షేమం అందుతుందని రేవంత్ రెడ్డి తెలిపారు. వైఎస్‌ఆర్ స్ఫూర్తితోనే సంక్షేమం, అభివృద్ధి, మూసీ ప్రక్షాళన చేపడుతామని రేవంత్ రెడ్డి వివరించారు. రాహుల్ పాదయాత్రతోనే పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ప్రశంసించారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలుపునకు కృషి చేసిన వారికి ఛైర్మన్ పదవులు ఇచ్చామని ప్రతికార్యకర్తకు గుర్తింపు ఉంటుందన్నారు. టిపిసిసి అధ్యక్షుడిగా మూడో సంవత్సరాలు ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొన్నామని రేవంత్ తెలియాజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News