Thursday, January 23, 2025

సంక్షేమ స్ఫూర్తి ప్రదాత వైఎస్ఆర్: పొన్నాల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సంక్షేమ స్ఫూర్తి ప్రదాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని మాజీ టిపిసిసి అధ్యక్షుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా పంజాగుట్ట లోని వైస్సార్ విగ్రహానికి టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంజన్ కుమార్ యాదవ్, చిన్నారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, రుద్రరాజు, అనిల్ యాదవ్, బల్ముర్ వెంకట్ ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొన్నాల లక్ష్మయ్య మీడియాతో మాట్లాడారు. సంక్షేమం, అభివృద్ధి, పెట్టుబడులు ఇలా అన్నింటికి ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి రాజశేఖర్ రెడ్డి అని ప్రశంసించారు. ఆంధ్ర ప్రదేశ్ భవిష్యత్ కు పునాదులు వేయడానికి అత్యధికంగా ఖర్చు చేసింది వైఎస్సార్ అని కొనియాడారు. పెన్షన్లు, ఆరోగ్య శ్రీ, ఇందిరమ్మ ఇళ్లు ఇవన్నీ వైఎస్సార్ ను గుర్తు చేస్తాయన్నారు. వైఎస్సార్ ను ఈ రాష్ట్రం, ఈ దేశం మరవదని,  రాహుల్ గాంధీ ప్రధాని కావాలనేది వైఎస్సార్ కల అని పొన్నాల గుర్తు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News