Monday, January 20, 2025

ఆ లేఖతో కొట్టుకున్న విద్యార్థిని తల్లి, టీచర్లు

- Advertisement -
- Advertisement -

అమరావతి: విద్యార్థిని నోట్ బుక్‌లో ఉన్న లేటర్ విషయంలో స్కూల్ టీచర్, బాలిక తల్లి కొట్టుకున్న సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైఎస్‌ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ప్రియ కూతురు లహరి ప్రొద్దుటూరులోని ఓ స్కూల్‌లో తొమ్మిదో తరగతి చదువుతోంది. లహరి నోట్ బుక్‌లో లేటర్ కనిపించడంతో తోటి విద్యార్థినులు స్కూల్ టీచర్ సునందకు అందజేశారు. ఆ లేటర్ ఆమె స్కూల్ ప్రిన్సిపాల్ కాశ్రీ ప్రసాద్ రెడ్డికి అందజేయడంతో ప్రియను అక్కడికి పిలిపించారు. చేతి రాత ఆధారంగా లహరిది కాదని తేలడంతో ప్రిన్సిపాల్ బాలికను వదిలేయడంతో పాటు బాలిక తల్లిని ఇంటికి వెళ్లమని చెప్పాడు.

Also Read: యువతిపై బాబాయ్ అత్యాచారం… గర్భవతి కావడంతో…

తరగతి గదికి వెళ్లిన తరువాత టీచర్ సునంద లెటర్ విషయంలో లహరిని చితకబాదింది. వెంటనే ఫోన్ ద్వారా తన తల్లికి బాలిక సమాచారం ఇవ్వడంతో ప్రియ అక్కడికి చేరుకొని తన కూతురును ఎందుకు కొట్టావని టీచర్ ను ప్రశ్నించింది. ఘర్షణ తారాస్థాయికి చేరుకోవడంతో జుట్లు జుట్లు పట్టుకొని కొట్టుకున్నారు. ఈ విషయం ప్రిన్సిపాల్ ఎంఇఒకు తెలియజేయడంతో పాటు డిఇఒ దగ్గరకు వెళ్లింది. డిఇఒ బాలిక తల్లితో ఫోన్ లో మాట్లాడారు. తన కూతురును వేధిస్తున్న ముగ్గురు టీచర్లపై సస్పెండ్ చేయాలని డిఇఒతో ఫోన్‌లో మాట్లాడారు. బాలిక తల్లి ప్రియపై ముగ్గురు టీచర్లు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News