Monday, December 23, 2024

ఛార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును జగనే చేర్పించడం దుర్మార్గం, సిగ్గుచేటు: షర్మిల

- Advertisement -
- Advertisement -

అమరావతి: సిబిఐ ఛార్జ్‌షీట్‌లో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ పేరు కాంగ్రెస్ పార్టీ చేర్చలేదని ఎపిసిసి ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల తెలిపారు. కోనసీమ జిల్లా రావులపాలెంలో ఎపిసిసి ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల మీడియాతో మాట్లాడారు. ఇప్పుడు ఎఎజిగా ఉన్న సుధాకర్ రెడ్డి ఛార్జ్‌షీట్‌లో చేర్చారని, వైఎస్‌ఆర్ పేరు లేకుంటే కేసు నుంచి బయటపడడం అసాధ్యమనే కేసు వేశారని గుర్తు చేశారు. హైకోర్టు, సుప్రీంకోర్టు, సిబిఐ కోర్టుల్లో సుధాకర్ రెడ్డి పిటిషన్లు వేశారని, సుధాకర్ రెడ్డి పిటిషన్ల మేరకే వైఎస్ పేరును సిబిఐ ఛార్జిషీట్‌లో చేర్చిందన్నారు.

కన్నతండ్రి పేరును కూడా జగన్ ఛార్జ్‌షీట్‌లో చేర్పించారని, కుమారుడిగా ఉండి కూడా తండ్రి పేరును అంత దుర్మార్గంగా ఏలా చేర్చుతారని ప్రశ్నించారు. వైఎస్‌ఆర్ పేరును ఛార్జిషీట్‌లో చేర్చినందుకే సుధాకర్ రెడ్డికి ఎఎజి పదవి కట్టబెట్టారని చురకలంటించారు. జగన్ ముఖ్యమంత్రి అయిన ఆరు రోజుల్లోనే సుధాకర్ రెడ్డికి ఎఎజి పదవి కట్టబెట్టారని, వైఎస్ఆర్ పేరును కుమారుడే ఛార్జిషీట్‌లో చేర్పించడం దుర్మార్గం, సిగ్గుచేటు అని వైఎస్ షర్మిల విమర్శించారు. స్వార్థంతోనే సిబిఐ ఛార్జిషీట్‌లో వైఎస్ పేరును జగన్ చేర్పించారని దుయ్యబట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News