Monday, December 23, 2024

మీకు మంచి జరిగి ఉంటేనే ఓటు వేయండి: జగన్

- Advertisement -
- Advertisement -

విజయవాడ: ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు అండగా నిలిచేందుకు వైఎస్‌ఆర్ వాహనమిత్ర పథకం తీసుకొచ్చామని సిఎం జగన్ తెలిపారు. వైఎస్‌ఆర్ వాహనమిత్ర నిధులను సిఎం జగన్ మోహన్ రెడ్డి విడుదల చేశారు. వాహనం ఇన్సూరెన్స్, ఇతర ఖర్చుల కోసమే వాహనమిత్ర ఉందని, వాహనాలకు సంబంధించి ఫిట్‌నెస్ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్ కచ్చితంగా ఉండేటట్లు చూసుకోవాలన్నారు. మాది ప్రజల ప్రభుత్వమని చెప్పడానికి గర్వపడుతున్నానని, వైఎస్‌ఆర్ వాహనమిత్ర పథకం అమలు చేస్తున్నందుకు గర్వపడుతున్నానని వివరించారు. వలంటీర్ వ్యవస్థతో పాలనను ప్రజలకు చేరువ చేశామని, పథకాలన్నీ అత్యంత పారదర్శకంగా అమలు చేస్తున్నామని జగన్ వివరించారు.

జగనన్న సురక్ష ద్వారా అవసరమైన సర్టిఫికెట్లు ఇంటికే అందిస్తున్నామని వెల్లడించారు. ఆర్‌బికెలతో రైతులకు అండగా ఉంటామని, వాయిస్ ఆఫ్ వాయిస్‌లెస్ అంటే పేదల గొంతుకై నిలబడిన ప్రభుత్వం తమదన్నారు. వైఎస్‌ఆర్ రైతు భరోసా కింద రూ.30,985 కోట్లు, మత్యకార భరోసా కింద రూ.538 కోట్లు, జగనన్న విద్యాదీవెన కింద రూ.11,317 కోట్లు, నేతన్న పథకం ద్వారా రూ.982 కోట్లు, జగనన్న వసతి దీవెన కింద 4275 కోట్లు, జగనన్న తోడు పథకం ద్వారా రూ.2957 కోట్లు ఖర్చు చేశామని జగన్ వెల్లడించారు. మేనిఫెస్టోలో చెప్పిన 99 శాతం హామీలను అమలు చేశామన్నారు. ఎక్కడా వివక్షకు తావులేకుండా సంక్షేమ పథకాలకు రూ.2.35 లక్షల కోట్లు ఖర్చు చేశామన్నారు. మీ ఇంట్లో మీకు మంచి జరిగి ఉంటే ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.

ఐదో విడత వైఎస్‌ఆర్ వాహన మిత్ర నిధులను విడుదల చేశారు. 2,75,931 మంది లబ్ధిదారులకు రూ.10 వేల చొప్పున సాయం చేశారు. బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో రూ.275.93 కోట్ల జమచేశారు. ఇప్పటివరకు ఎపి ప్రభుత్వం అందించిన మొత్తం సాయం రూ.1301.89 కోట్లుగా ఉంది. 50 నెలల్లో ఒక్కొక్క వాహన డ్రైవర్‌కు దాదాపుగా రూ.50 వేల చొప్పున లబ్ధి చేకూరనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News