Wednesday, January 22, 2025

వైఎస్‌ఆర్ పేదల గుండెల్లో నిలిచిపోతారు

- Advertisement -
- Advertisement -

కేపీహెచ్‌బి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దివంగతనేత వై ఎస్‌ఆర్ అందించిన సేవలు మరువలేనివని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. శనివారం కేపీహెచ్‌బీ కాలనీలో కూకట్‌పల్లి వైఎస్‌ఆర్ సేవా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైఎస్‌ఆర్ విగ్రహాన్ని మా ధవరం కృష్ణారావు, కార్పొరేటర్ పగుడాల బాబూరావులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్‌ఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలచిపోయాయన్నారు.

ఆరోగ్యశ్రీ, ఫీజు రీయంబర్సుమెంట్ లాంటి పథకాలతో బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి కృషి చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అభిమాన సంఘం నేతలు శివారెడ్డి, సతీష్‌రెడ్డి, మధుసూధన్‌రెడ్డి, ఉపేందర్‌రెడ్డి, కృష్ణారెడ్డి, వెంకట్‌రెడ్డి, అరవింద్‌రెడ్డి, జీఎల్‌ఎన్‌రెడ్డి, జగదీష్‌రెడ్డి, జయచంద్రారెడ్డి, ఐస్‌క్రీం వెంకట్‌రెడ్డి, చెన్నారెడ్డి, కాముని నర్సింహ్మారెడ్డి, సురేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News