Monday, December 23, 2024

లోకేష్ పాదయాత్రలో పొట్టు పొట్టు కొట్టుకున్న టిడిపి, వైసిపి కార్యకర్తలు

- Advertisement -
- Advertisement -

నూజివీడు :  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లా నూజివీడు మండలం తుక్కులూరులోకి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రవేశించగా కొందరు వైసీపీ జెండాలు ఊపారని లోకేష్ యువగళం టీం సభ్యులు ఒక్కసారిగా వైసీపీ అభిమానులపై దాడికి దిగారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇరు వర్గాలు ఘర్షణకు దిగడంతో ప్రాంగణమంతా రసాభసా అయింది. మా ఊరు వచ్చి మమ్మల్నే కొడతారా అంటూ వైసీపీ అభిమానులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సైకో పోవాలి అంటూ టిడిపి పెట్టిన డిజే ఆపాలని వైసిపి కార్యకర్తలు డిమాండ్ చేశారు. దీంతో వైసిపి కార్యకర్తలపై టిడిపి శ్రేణులు దాడి చేశారు. ఈ దాడిలో రెండు బైకులు పాక్షికంగా ధ్వంసం అయ్యాయి. ఇరు వర్లాలను చెదరగొట్టిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News