Sunday, December 22, 2024

టిడిపి దాడులు… వైసిపి కార్యకర్త మృతి

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాప్తంగా వైఎస్ఆర్ సిపి కార్యకర్తలపై టిడిపి శ్రేణులు దాడులకు పాల్పడుతున్నాయిని ఆ పార్టీ నేతలు ఆరోపణలు చేశారు. హిందూపూర్ రూరల్ గొల్లపురం గ్రామంలో టిడిపి కార్యకర్తలు దాడులు చేయడంతో వైఎస్ఆర్ సిపి కార్యకర్త సతీష్ మృతి చెందాడు. వైసిపి కార్యకర్త సతీష్ పై టిడిపి శ్రేణులు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని బెంగళూరులో ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.  24గంటల పాటు చావు బతుకుల మధ్య పోరాడి చికిత్స పొందుతూ సతీష్ మృతి చెందాడు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో వైయస్‌ఆర్‌సిపి సోషల్ మీడియా కార్యకర్త అశోక్‌పై బీర్ బాటిల్‌తో దాడి చేశారు. వికలాంగుడైన అశోక్ తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. అశోక్ తలకు బలమైన గాయాలైనట్టు సమాచారం. శ్రీ సత్య సాయి జిల్లాలో వైయస్‌ఆర్‌సిపి సోషల్ మీడియా కో- కన్వీనర్ మెగా అంజాద్ పై టిడిపి కార్యకర్తలు దాడి చేశారు. పట్టపగలు నడిరోడ్డుపై పాశవికంగా దాడి చేయడంతో స్థానికులు అడ్డుకొని అంజాద్ ను ఆస్పత్రికి తరలించారు. అంజాద్ తీవ్రంగా గాయపడి చికిత్స తీసుకుంటున్నాడు. మూడు చోట్ల టిడిపి శ్రేణులు దాడులకు పాల్పడ్డాయని తన ఎక్స్ లో వైఎస్ఆర్ సిపి పోస్టు చేసింది. 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News