Wednesday, January 22, 2025

తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు మోసాలను ఎండగడదాం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మోసపూరిత వాగ్ధానాలు, అపద్దపు ప్రకటనలతో ప్రజలను మోసగిస్తున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కుట్రలను ఎండగడదామని వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌పార్టీ ఐటి విభాగం ఐటి రంగ ఉద్యోగులకు పిలుపునిచ్చింది. శనివారం ఇక్కడి బుట్టా కన్వెన్షన్‌లో వైఎస్‌ఆర్‌సిపి ఐటి విభాగం సమావేశం జరిగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఆ పార్టీ ఐటి విభాగం అధ్యక్షుడు పోసిమ్‌రెడి సునిల్‌కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పెద్ద సంఖ్యలో వివిధ కంపెనీలకు చెందిన ఐటి ఉద్యోగులు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా సునిల్ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ మోసపూరిత వాగ్ధానాలతో ప్రజలను వంచించేందుకు చంద్రబాబు కోటరి మరోమారు సిద్దమవుతోందన్నారు . చంద్రబాడు మోసాలకు గురికాకుండా ప్రజలను అప్రమత్తం చేయాల్సిన బాధ్యత తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ఐటి ఉద్యోగిపైన ఉందన్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్నందున ఏపిలో ముఖ్యమంత్రి జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలు , అభివృద్దిపనులు ప్రజలకు వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

పార్టీ ఐటి విభాగంలోని ప్రతి సభ్యుడు మరో మారు వైఎస్ జగన్ విజయం కోసం ఇప్పటినుంచే కృషి చేయాలని విజ్ణప్తి చేశారు. ఈ సందర్బంగా వైఎస్‌ఆర్‌సిపి ఐటి విభాగంలో మిషన్ ఐటి ఆర్మి వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు. మిషన్ ఐటి ఆర్మిలో ఒక్కో కార్యకర్త 50మంది ఐటి ఉద్యోగులను సభ్యులుగా చేర్పించాలని సునిల్ కుమార్‌రెడ్డి విజ్ణప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఐటి విభాగం కన్వీనర్ హరీష్‌రెడ్డితోపాటు పెద్ద సంఖ్యల ఆ పార్టీ ఐటి విభాగం నేతలు , సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News