Friday, January 24, 2025

వైసిపి నాయకుడు వీరంగం… టోల్‌గేట్ సిబ్బందిని చితకబాదిన ఎంపిటిసి భర్త

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నమయ్య రాయచోటి సమీపంలో వైఎస్‌ఆర్‌సిపి నాయకు దౌర్జన్యం సృష్టించాడు. బండపల్లి టోల్‌గేట్ సిబ్బందిపై బుధవారం తెల్లవారుజామున ఎంపిటిసి శ్రీలత భర్త దాడి చేశాడు. లక్కిరెడ్డిపల్లె మండలం పాలెం ఎంపిటిసి భర్త శివశంకర్, అతడి అనుచరులు దాడి చేశారు. గేట్ తీయాలంటూ సిబ్బందిని వైఎస్‌ఆర్‌సిపి నాయకుడు వీరంగం సృష్టిస్తూ దూషించాడు. గేటు తీసేలోపు సిబ్బందిని వైసిపి నాయకుడు, ఆయన అనుచరులు చితకబాదారు. అన్నమయ్య జిల్లాలో మరో టోల్‌గేట్ సిబ్బందిని కూడా వీరు చితకబాదిన వైనం వెలుగులోకి వచ్చింది. సిసి కెమెరా దృశ్యాలను పోలీసులకు టోల్‌గేట్ సిబ్బంది అందజేశారు. రామాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News