Friday, January 10, 2025

సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమా?.. లోకేష్‌కి పేర్ని నాని సవాల్

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్ అనంతరం ఏపీ రాజకీయాలు కాక రేపుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై మరొకరు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. వైసిసి ఎమ్మెల్యే పేర్ని నాని మరోసారి నారా లోకేష్ పై మండిపడ్డారు. చంద్రబాబు సచ్ఛీలుడైతే సింగిల్ జడ్జితో విచారణకు సిద్ధమా అని పేర్ని నాని సవాల్ విసిరారు.

చంద్రబాబు చేసిన పాపాలకు శిక్ష తప్పదని పేర్నినాని జోస్యం చేప్పారు. ఆదివారం తాడేపల్లిలోని వైఎస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ.. కాపులకు రిజర్వేషన్లు ఇస్తానని మోసం చేసిన చంద్రబాబు.. ముద్రగడ పద్మనాభం నిరసనకు వెళితే వేధించారన్నారు. చంద్రబాబు జైలుకు వెళితే టిడిపి నేతలు ఎవరూ బాధపడరన్నారు. నిరసన కార్యక్రమాలను రాజకీయ కార్యక్రమాలు మాత్రమే చేశారు. లంచం తీసుకుని గంటలు కొడతారా? అని ఆయన ప్రశ్నించారు.

చంద్రబాబు ప్రజల సొమ్ము తిన్నారని ప్రజలు అనుకుంటున్నారు. అందుకే ఎవరూ నిరసన కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని ఆయన వెల్లడించారు. అక్రమ కేసులుంటే చంద్రబాబుకు కోర్టులో ఎందుకు అనుకూల తీర్పులు రావడం లేదు? అమరావతి స్కామ్, ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్‌లో భారీగా వెనక్కి తగ్గారన్నారు. చంద్రబాబుపై కేసులు ఉంటే లోకేశ్‌ ఎందుకు లాయర్ల చుట్టూ తిరుగుతున్నారని పేర్ని నాని ప్రశ్నించారు.

లోకేష్‌కు దమ్ము ఉంటే చంద్రబాబు అక్రమ ఆస్తులపై విచారణకు సిద్ధంగా ఉండాలన్నారు. చంద్రబాబు అధికారం చేపట్టినప్పటి నుంచి విచారణ చేద్దాం. సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమా? చంద్రబాబుపై ఉన్న కేసులన్నింటిపై ఎందుకు స్టే తెచ్చుకున్నారు? ఇంత కాలం స్టేలు తెచ్చుకుని బాబు బతికాడు. జీవిత ఖైదు తప్పని వారు స్టేలు తెచ్చుకున్నారు. చంద్రబాబు తన నిజాయితీని కోర్టుల్లో నిరూపించుకోవాలి అని నాని అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News