Tuesday, December 24, 2024

ఆ నలుగురు ఎమ్మెల్యేలపై వేటు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సొంత పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలపై వైసిపి పార్టీ వేటు వేసింది. గురువారం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో విప్ ఉల్లంఘించినందుకు నలుగురు వైసిపి ఎమ్మెల్యేలు కోటంరెడ్డి, ఆనం, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు.

నలుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడినట్లు గుర్తించామని తెలిపారు. ఒక్కొక్క ఎమ్మెల్యేకు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు రూ.15 కోట్ల నుంచి రూ.20కోట్లు ఇచ్చారని చెప్పారు. క్రాస్ ఓటింగ్ పై అంతర్గతంగా విచారణ చేసిన తర్వాత వారిపై చర్యలు తీసుకున్నామని, వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు సజ్జల వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News