Thursday, January 23, 2025

గడ్డపారతో పొడిచేస్తాం…. టిడిపి కార్యకర్తలపై దాడి

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధప్రదేశ్‌లో వైఎస్‌ఆర్‌సిపి కార్యకర్తలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. సోమవారం ఓ వైఎస్‌ఆర్‌సిపి నాయకుడు వీరంగం సృష్టించాడు. నెల్లూరు జిల్లా మనుబోలు మండలం కట్టుపల్లి గ్రామంలో బాబు ష్యూరిటీ-భవిష్యత్తకు గ్యారెంటీ ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రచారం చేపట్టారు. వైఎస్‌ఆర్‌సిపి కార్యకర్తలు బల్లి వెంకటయ్య, సాయం, అంకయ్య, అయ్యప్పలు టిడిపి నాయకులపై దాడులకు తెగపడ్డారు. బల్లి వెంకటయ్య గడ్డపార తీసుకొని వారిపై దాడి చేయడానికి ప్రయత్నించడంతో ఘర్షణ పెద్దది అవుతుందని అక్కడి నుంచి సోమిరెడ్డి వెళ్లిపోయారు. గడ్డపారతో పొడిచి చంపేస్తామని టిడిపి నాయకులను వెంకటయ్య బెదిరించాడు. అక్కడ ఉన్న టిడిపి ఫ్లెక్సీలను వైసిపి కార్యకర్తలు చించేశారు. కట్టుపల్లి గ్రామ టిడిపి నాయకుడు మహేంద్ర ఇంటికి వైసిపి కార్యకర్తలు వెళ్లి ఆయనపై దాడికి పాల్పడ్డారు. ఆయన కారు, కిటికీ అద్దాలను పగులగొట్టారు. స్థానిక మహిళలు అడ్డురావడంతో అక్కడి నుంచి వైఎస్‌ఆర్‌సిపి కార్యకర్తలు వెళ్లిపోయారు. దీంతో టిడిపి నాయకుడు వెంకటయ్య ఇంటికి వెళ్లి గొడవకు దిగడంతో ఆయన అక్కడి నుంచి పారిపోయాడు. ఇరువర్గాలు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News