Thursday, January 23, 2025

వైఎస్‌ఆర్ ఆశయాలను సాధించాలి

- Advertisement -
- Advertisement -

విద్యానగర్: సంక్షేమ పథకాలతో పేదల సాధికారత, వి ద్యాభివృద్ధి కోసం ఎనలేని కృషి చేసిన మహనీయుడు వై. ఎస్ రాజశేఖర రెడ్డి అని సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అనిల్‌కుమార్ యాదవ్ కొనియాడారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు శనివారం రాంనగర్ గుండు చౌరస్తాలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ వినూత్న పథకాలతో పేదప్రజల అభ్యున్నతి కోసం ఎంతో శ్రమించారని చెప్పారు.

ము ఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రగతికి ఆయన చేసిన కృషి మరువలేనిదన్నారు. వైఎస్ ఆశయాల సాధన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల లక్ష్యమని తెలిపారు. అడిక్‌మెట్ డివిజన్ పార్టీ అధ్యక్షుడు జంభిక తిరుమల్ రావు అధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కల్పనా యాదవ్, గజ్జెల రుషి కే శ్వర్, డాక్టర్ అన్సారీ, జూహెర్ హుస్సేన్, పాశం అనిల్, శివ లతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News