Wednesday, January 22, 2025

వైతెపా అధ్యక్షురాలు షర్మిల అరెస్టు

- Advertisement -
- Advertisement -
ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలింపు !

హైదరాబాద్: పంజాగుట్టలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం ‘ప్రగతి భవన్’ ముట్టడికి పిలుపునిచ్చిన వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిలను నేడు(మంగళవారం) పోలీసులు అరెస్టు చేశారు. వరంగల్‌లో సోమవారం ఆమె నిర్వహించిన పాదయాత్రలో జరిగిన ఘటనలకు నిరసనగా ఆమె ఈ ‘ఘెరావ్’కు పిలుపునిచ్చారు. కారులో ఆమె వెళ్తుండగా పోలీసులు పంజాగుట్ట చౌరస్తా వద్ద అడ్డుకున్నారు. షర్మిల డ్రైవింగ్ సీట్లో ఉండగానే కారును పోలీసులు క్రేన్‌తో లిఫ్ట్ చేసి తరలించారు. పోలీసుల వైఖరికి వైతెపా కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దాంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైతెపా కార్యకర్తల ఆందోళనతో రాజ్‌భవన్ రోడ్డులో ట్రాఫిక్ స్తంభించిపోయింది.

వరంగల్‌లో సోమవారం ఆమె పాదయాత్ర నిర్వహించినప్పుడు తెరాసకు చెందిన స్థానిక ఎంఎల్‌ఏ పెద్ది సుదర్శన్‌పై ఆమె అనుచిత వ్యాఖ్యలు చేశారు. దాంతో ఆమె పాదయాత్రను తెరాస కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. పాదయాత్రను నిలిపివేయాలని నర్సంపేట ఏసిపి సంపత్ రావు ఆమెను కోరినప్పుడు అందుకామె నిరాకరించారు. ఆ తర్వాత శంకరం తండా సమీపంలో షర్మిల కార్వాన్‌పై కొందరు వ్యక్తులు పెట్రోలు పోసి నిప్పంటించారు. ఇన్నోవా వాహనం అద్దాలు పగలగొట్టారు. షర్మిలను తర్వాత హైదరాబాద్ తరలించారు. సోమవారం జరిగిన పరిణామాలకు నిరసనగా షర్మిల మంగళవారం ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చి కారులో బయలుదేరారు. పంజాగుట్ట పోలీసులు అడ్డుకున్నా ఆమె ఏ మాత్రం తగ్గలేదు. దాంతో క్రేన్ సాయంతో ఆమెను, ఆమె కారును ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News