Wednesday, March 19, 2025

యాదగిరిగుట్ట అభివృద్ధికి వైటిడి బోర్డు ఏర్పాటు: కొండసురేఖ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గతంలో యాదగిరిగుట్టలో భక్తులకు సరైన వసతులు లేవని.. ఈ ప్రభుత్వం కోట్లు ఖర్చు పెట్టి యాదగిరిగుట్టలో వసతులు కల్పించిందని మంత్రి కొండ సురేఖ తెలిపారు. శాసనసభలో ఆమె మాట్లాడుతూ.. యాదగిరిగుట్ట అభివృద్ధి కోసం వైటిడి బోర్డును ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. సమర్థమైన పాలకమండలిని నియమించి యాదగిరిగుట్ట క్షేత్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామని అన్న మంత్రి.. ఏడాదికి రూ.100 కోట్లు వచ్చే ఆలయాలకు బోర్డు ఏర్పాటు చేసుకోవచ్చని వెల్లడించారు. ఈ బోర్డులో మొత్తం 18 మంది సభ్యులు ఉంటారని.. బోర్డు పదవీకాలం రెండు సంవత్సరాలుగా నిర్ణయించినట్లు పేర్కొన్నారు. వైటిడికి ఐఎఎస్ స్థాయి అధికారి ఇవొగా ఉంటారని స్పష్టం చేశారు. బోర్డు ఛైర్మన్, సభ్యులకు ఎలాంటి జీతభత్యాలు ఉండవని, వైటిడి బోర్డు కూడా విద్యా సంస్థలను స్థాపించవచ్చు, నిర్వహించవచ్చని తెలిపారు.. యాదగిరిగుట్టలో ఆధ్యాత్మిక, వేద విద్యా సంస్థలను స్థాపించవచ్చన్నారు. వైటిడికి బడ్జెట్‌ ఆమోదం ప్రభుత్వం ద్వారానే జరుగుతుందని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News