Sunday, January 5, 2025

ప్రధాని మోడీకి బంగ్లాదేశ్ నుంచి యూనుస్ ఫోన్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌లో హిందువులపై ఇటీవల జరిగిన దాడులు , భద్రతను పరిష్కరించేందుకు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు ముహమ్మద్ యూనస్ శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీకి ఫోన్ చేశారు.

షేక్ హసీనా నేతృత్వంలోని ప్రభుత్వం పతనమయ్యాక యూనుస్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మోడీ , యూనస్ మధ్య జరిగిన మొదటి సంభాషణ ఇది. బంగ్లాదేశ్‌లోని హిందువుల భద్రత గురించి ఎర్రకోట ప్రాకారాల నుండి స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోడీ ఆందోళన వ్యక్తం చేసిన ఒక రోజు తర్వాత ఈ ఫోన్ వచ్చింది. కాగా బంగ్లాదేశ్ లో హిందువులు, ఇతర మైనారిటీలు సురక్షితంగా ఉండాలని భారతీయులు కోరుకుంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News