Thursday, January 9, 2025

పంత్‌ను కలిసిన యువరాజ్… వైరల్

- Advertisement -
- Advertisement -

లక్నో: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ను మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ కలిశారు. ఇద్దరు కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. డిసెంబర్ 2022లో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఢిల్లీ నుంచి తన సొంతూరుకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో అతడు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. రిషబ్ పంత్ రోజు రోజుకు కోలుకుంటున్నాడు. పంత్ కర్రసహాయంతో ఇంట్లో నడుస్తుండగా యువరాజ్ ఇంటికి వెళ్లి కలిసిన వీడియోలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఛాంపియన్ మళ్లీ ఎదుగుతున్నాడని యువరాజ్ క్యాప్షన్ ఇచ్చాడు. నవ్వుతూ, పాజిటివ్ మైండ్‌తో ఉంటే ఎక్కువ శక్తి రావడంతో పాటు ఆరోగ్యంగా ఉంటావని యువి తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాశాడు. పూర్తి ఫిట్‌నెస్‌గా తిరిగిన రావాలని పంత్ అభిమానులు, క్రికెట్ ఫ్యాన్స్ కోరుతున్నారు. పంత్ పెద్ద ప్రమాదం బయటపడిన విషయం తెలిసిందే.

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News