Monday, January 20, 2025

ప్రజల మధ్య అనుసంధానం పెంపొందించే “యువ సంగమం”

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : కేంద్ర విద్యా మంత్రిత్వశాఖకు చెందిన యూత్ ఎక్స్‌ఛేంజి కార్యక్రమం “యువసంగం” దేశం లోని వైవిధ్యాన్ని, ప్రజల మధ్య అనుసంధానాన్ని పెంపొందించడంలో గొప్ప చొరవ చూపిస్తోందని ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం ప్రశంసించారు. ప్రధాని తన మన్‌కీబాత్ 101వ ఎపిసోడ్ సందర్భంగా యువసంగంలో పాల్గొన్న కొంతమంది అభ్యర్థులతో ముచ్చటించారు. తమ అనుభవాలను బ్లాగ్‌ల్లో రాస్తే మిగతా వారు కూడా తెలుసుకుంటారని వారికి సూచించారు. దేశం లోని ఒక ప్రాంతానికి చెందిన విద్యార్థులు ఇతర ప్రాంతాలను సందర్శించి, అక్కడి సంస్కృతి, వారసత్వ సంప్రదాయాలను తెలుసుకోడానికి యూత్ ఎక్స్‌ఛేంజి కార్యక్రమం దోహదం చేస్తోంది.

ప్రజల మధ్య అనుసంధానం పెంపొందించి జీవన వైవిధ్యాన్ని అర్ధం చేసుకోవడమే ఈ కార్యక్రమం లక్షం . ఇప్పటికి 1200 మంది విద్యార్థులు ఈ కార్యక్రమం కింద మొదటి దశలో 22 రాష్ట్రాలను సందర్శించ గలిగారు. “ ఈరోజు మన్‌కీబాత్ ఎపిసోడ్ ద్విశతి ప్రారంభాన్ని సూచిస్తోంది. గత నెల స్పెషల్ 100 ఎపిసోడ్ కార్యక్రమంలో యావత్ దేశం పాలుపంచుకుంది. ఇది ప్రసారం కాగానే ప్రపంచ ం మొత్తం మీద వివిధ ప్రాంతాల వారు పెద్ద సంఖ్యలో వింటున్నారు. చాలా మంది మన్‌కీబాత్‌ను నిర్మాణాత్మకంగా విశ్లేషిస్తున్నారు.” అని ప్రధాని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News