Thursday, December 19, 2024

యువరాజు భట్ సేవలు మరువలేనివి

- Advertisement -
- Advertisement -
  • ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి

వర్గల్: జర్నలిస్టు వృత్తితో పాటు సామాజిక సేవా కార్యక్రమాలలో నిరంతరం భాగస్వాములైన యువరాజ్ భట్ సేవలు మరువలేనివని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి , ఎఫ్‌డిసి చైర్మన్ ప్రతాపరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం గౌరారం లోని వ్యవసాయ క్షేత్రంలో యువరాజు కాస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన సందర్భంగా మాట్లాడారు. మూడు దశాబ్దాల పాటు వివిధ రంగాల్లో సేవలందించిన యువరాజు పేద ప్రజల పక్షపాతిగా పనిచేసిన గొప్ప వ్యక్తి అని కొరియాడారు . నిరంతరం ప్రజా సమస్యలు ఎలుగెత్తి చూపుతూ ప్రభుత్వానికి , ప్రజలకు వారదిగా పనిచేసిన యువరాజు నేటి తరం జర్నలిస్టులకు స్ఫూర్తిదాయకమని అన్నారు.

అలాగే డిసిసి అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి , మాజీ ఎంపిపి నిమ్మ రంగారెడ్డి యువరాజు విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి, వర్గల్ జెడ్పిటిసి బాలు యాదవ్, నేతలు కర్ణాకర్ రెడ్డి, జుబేర్ పాషా, కనకయ్య, అచ్చం గారి భాస్కర్ జర్నలిస్టులు విజయరావ్ , కృష్ణ, పవన్ కుమార్ , నర్సింలు, శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులు యువరాజు విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కళాకారుడు రమేష్ యువరాజును గుర్తుచేస్తూ పాట పాడటం అందరిని కంటతడి పెట్టించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News