హైదరాబాద్: టీమిండియా బ్యాట్స్ మెన్ అభిషేక్ శర్మ సెంచరీతో చెలరేగాడు. ఐదో టి20లో సిక్స్ ల వర్షం కురిపించడంతో భారత జట్టు 150 పరుగుల తేడాతో గెలిచింది. బౌలింగ్ లో కూడా శర్మ రెండు వికెట్లు తీశారు. తొలి బంతి నుంచి దాటిగా ఆడి పరుగులు చేయడానికి ప్రయత్నిస్తునే ఉంటానని భారత ఓపెనర్ అభిషేక్ శర్మ తెలిపారు. కెప్టెన్, కోచ్ మద్దతు ఇచ్చారని, ఇప్పుడు ఇదే విధంగా ఆడాలని వారు సూచించారని, తనకు ఎలాంటి సమ్యలు లేవన్నారు. రషీద్ బౌలింగ్ లో సిక్స్ కొట్టడం అద్భుతంగా ఉందని, స్ట్రెయిట్ డ్రైవ్ సిక్స్ కొట్టడంతో యువరాజ్ సింగ్ సంతోష పడి ఉంటాడని, తాను క్రీజులో 15 ఓవర్లు పాటు ఉండాలని కోరుకుంటున్నారన్నారు. ఇంగ్లాండ్ బౌలర్లు 140 నుంచి 150 కిలో మీటర్ల వేగంతో బంతులు వేసినప్పుడు ఒక సెకన్ కంటే ముందుగానే సిద్ధంగా ఉండాలన్నారు. బంతి తగినట్లుగానే స్పందించి తన షాట్లు ఆడానని అభిషేక్ శర్మ తెలియజేశారు.
ఆ షాట్ తో యువరాజ్ సంతోష పడి ఉంటాడు: అభిషేక్ శర్మ
- Advertisement -
- Advertisement -
- Advertisement -