Friday, January 10, 2025

శంషాబాద్ ఎయిర్ పోర్టులో యువతి హల్‌చల్

- Advertisement -
- Advertisement -

శంషాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం రాత్రి ఓ యువతి హల్‌చల్ చేసింది. శ్వేత అనే యువతి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేసింది. ఇది గమనించిన సిఐఎస్‌ఎఫ్ అధికారులు యువతిని రక్షించారు. ప్రియుడు విష్ణువర్ధన్‌రెడ్డితో శ్వేత కలిసి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అయితే వీరి ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో యువతి అరెవెల్ రన్‌వే పై నుండి దూకడానికి ప్రయత్నం చేసింది. వెంటనే సిఐఎస్‌ఎఫ్ అధికారులు గమనించి ఆమెను రక్షించి ఆర్‌జిఐ పోలీసులకు అప్పగించారు.యువతి బెంగళూరు నుంచి హైదరాబాదులో ఓ కంపెనీ పెట్టడానికి వచ్చినట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News